చెస్‌లో అంతర్జాతీయ రేటింగ్
అమలాపురం టౌన్: అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన మరో ముగ్గురు విద్యార్థులు చెస్‌లో అంతర్జాతీయ రేటింగ్ సాధించారని ఆ అకాడమీ ప్రిన్సిపాల్, జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకటసురేష్ తెలిపారు. పెద్దాపురం జవహర్ నవోదయ స్కూల్‌లో చదువుతున్న కొండా శివేంద్ర 1,406 రేటింగ్ పాయింట్లు, అమలాపురం విద్యానిధి స్కూల్‌లో చదువుతున్న పితాని రాఘవేంద్ర 1,443, సాధనాల శ్రీసంతోష్ 1,494 రేటింగ్ పాయింట్లు సాధించారని అన్నారు. ఇంత వరకూ విక్టరీ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు రేటింగ్ సాధించారని వివరించారు. అంతర్జాతీయంగా రేటింగ్ సాధించిన విద్యార్థులను రాష్ట్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కవురు జగదీష్, అమలాపురం విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఆకుల బాపన్న నాయుడు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment