చదువుల పండగకు సర్వం సిద్ధం
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో చదువుల పండగ పేరుతో ఆదివారం నుంచి 4వ తేదీ వరకూ మహాక్రతువులు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశామని ఆలయ ఈఓ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు శనివారం తెలిపారు. శ్రీపంచమి సందర్భంగా ఆదివారం గణపతి కల్ప ప్రారంభంతో సప్తనదీ జలాభిషేక సహిత లక్ష కలాల వితరణ మహోత్సవాలకు శ్రీకారం చుడతామన్నారు. స్వామివారి సప్తనదీ జలాభిషేకం కోసం సప్త నదులైన గోదావరి, గంగ, యమున, సరస్వతి, సింధు, కావేరి, నర్మద నుంచి ఆలయ అధికారులు జలాలు సేకరించారు. భక్తుల దర్శనార్థం ఆలయ మండపంలో సప్తనదీ జలాలు, లక్ష కలాలు ఉంచారు. జలాభిషేకం అనంతరం స్వామివారి పాదాల వద్ద లక్ష కలాలతో పూజలు చేసేందుకు వేద పండితులు ఏర్పాట్లు చేశారు. 3న సరస్వతీ కల్పం, 4న మహా పూర్ణాహుతి పూజలు ఉంటాయి. శ్రీపంచమి సందర్భంగా స్వామివారి సన్నిధిలో విద్యార్థులచే సరస్వతీ పుజలు చేయిస్తారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారని ఈఓ తెలిపారు. లక్ష కలాలను విద్యార్థులకు ఈ నెల 8, 9 తేదీల్లో పంపిణీ చేస్తామన్నారు. స్వామి కలాలతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు వస్తాయనేది విద్యార్థుల నమ్మకం. అందుకే స్వామివారి కలాల కోసం విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ సారి కూడా స్వామివారి సప్తనదీ జలాలు, లక్ష కలాల వితరణ కార్యక్రమానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులతో కిటకిట
స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో వేకువజాము నుంచే ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృత, లఘున్యాస అభిషేకాలు, శ్రీలకీ్‌ష్మ్ గణపతి హోమం నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రసన, తులాభారం జరిపారు. స్వామివారి అన్న ప్రసాదాన్ని 1,720 మంది భక్తులు స్వీకరించారు. ఈ ఒక్కరోజు వివిధ పూజా టిక్కెట్లు, ప్రసాదాలు, అన్నదాన విరాళాలు, తదితర వాటి ద్వారా రూ.2.44 లక్షల ఆదాయం సమకూరిందని ఈఓ సత్యనారాయణరాజు తెలిపారు.
నేడు లక్ష కలాల పూజ
అయినవిల్లిలో ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment