కరప: వాకాడ పాఠశాలలో కొందరి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు వీఎస్ రామారావు కేసును నిర్వీర్యం చేస్తున్నట్టు మానవ హక్కుల వేదిక శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. నిజ నిర్ధారణ కోసం వాకాడ పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పోలీసులను కలసినట్టు ఆ సభ్యులు తెలిపారు. గ్రామస్తులు, ఉపాధ్యాయులు కానీ ఏమీ చెప్పకపోవడం, కరప పోలీస్ స్టేషన్‌లో దీనికి సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. బాధితులు, తల్లిదండ్రులు నోరు తెరిచి చెప్పుకోకుండా కట్టడి చేసినట్టు ఆరోపించారు. నిజ నిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్, ఉపాధ్యక్షుడు ఎ.రవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇక్బాల్, శ్రీధర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment