మొరాయించిన సర్వర్.. పింఛన్ల పంపిణీలో ఇబ్బంది
రాజమహేంద్రవరం రూరల్: సర్వర్ మొరాయించడంతో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో శనివారం ఉదయం ఇబ్బందులు తలెత్తాయి. సర్వర్ పని చేయకపోవడంతో పింఛన్లు పంపిణీ మందకొడిగా సాగింది. ప్రతి నెలా ఉదయం 7 గంటలకే 90 శాతం పూర్తయ్యేది. ఈసారి ఆ సమయానికి 66.14 శాతం మాత్రమే పంపిణీ జరిగింది. దీంతో సిబ్బంది మధ్యాహ్నం వరకూ పింఛన్లు పంపిణీ చేయా ల్సి వచ్చింది. జిల్లావ్యాప్తంగా రాత్రి 9 గంటల సమ యానికి 95.81 శాతం పింఛన్లు పంపిణీ చేశామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బొమ్మూరు గ్రామ పంచా యతీ పరిధిలోని కాపుల వీధిలో లబ్ధిదారులకు ఉద యం ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. జిల్లాలో 2,36,331 మంది లబ్ధిదారులకు రూ.102.14 కోట్ల మేర పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం వరకూ 2,12,647 మందికి పంపిణీ చేశామన్నారు. ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, డీఆర్‌డీఏ పీడీ ఎన్‌వీవీఎస్ మూర్తి, రూరల్ ప్రత్యేకాధికారి కేఎన్ జ్యోతి, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, ఈవో పీఆర్ అండ్ ఆర్డీ ఆర్మ్‌స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment