తెలికిచెర్లలో గంజాయ్ బ్యాచ్!
నల్లజర్ల: మండలంలోని తెలికిచెర్లలో గంజాయి బ్యాచ్‌పై తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు గురువారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించి తాడేపల్లిగూడెంలో దొరికిన ఆధారాలతో అక్కడి వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణ పోలీసులు గురువారం తెల్లవారుజామున తెలికిచెర్లలో కంకిపాటి నాగరాజు, కుంచే శ్రీహరి, గుండుబోగుల మురళి ఇళ్లలో సోదాలు చేసి అధిక మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకుని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులను వివరణ కోరగా ఈ విషయం వాస్తవమేనని శుక్రవారం విలేకరుల సమావేశంలో విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. నిందితులంతా జనసేన కార్యకర్తలు కావడం గమనార్హం.
రికార్డుల సాధనలో
కృష్ణ కామేశ్వర్ హ్యాట్రిక్
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ పేరు ఈ సంవత్సరం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రకటించిన జాబితాలో నమోదైంది. ఆ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా రెండు రికార్డులను సాధించారు. కరెన్సీ నోట్లు, తపాలా బిళ్లల సేకరణలో ఈ రికార్డులను ఆయన కై వసం చేసుకున్నారు. 2023 సంవత్సరంలో కృష్ణ కామేశ్వర్ కరోనా నాణేల సేకరణలోనూ, 2014లో తపాలా బిళ్లల సేకరణలోనూ రెండు రికార్డులను సాధించిన విషయం తెలిసిందే. 2025 పుస్తకంలో చోటు చేసుకునే రికార్డుల్లో అత్యధిక ముఖ విలువ కరెన్సీ నోట్లను సేకరించినందుకు ఒకటో రికార్డు సాధించారు. ఇందులో 91 దేశాలకు చెందిన 100 నుంచి వంద క్వాడ్రిల్లియన్ (ఒకటి పక్కన 17 సున్నలు) వరకూ ముఖ విలువ కలిగిన 306 నోట్లు ఉన్నాయి. రూ.5 ముఖ విలువ కలిగిన తపాలా బిళ్లల విభాగంలో 360 తపాలా బిళ్లలను సేకరించి రెండో రికార్డు సాధించారు. కృష్ణ కామేశ్వర్ నాణేలు, కరెన్సీ నోట్లు, తపాలా బిళ్లల సేకరణలో ఒకొక్క విభాగంలో ఒక్కో లిమ్కా రికార్డు సాధించి మొత్తంగా నాలుగు రికార్డులను పొందిన తొలి తెలుగు వ్యక్తి కావడం గమనార్హం.
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
నిడదవోలు: పట్టణంలో చినకాశిరేవు వద్ద గురువారం రైలుపట్టాలపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాగల్లు మండలం నందిగంపాడు గ్రామానికి చెందిన ఆత్కూరి లింగేశ్వరరావు (44)కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతని భార్య విడిపోయి పదేళ్ల నుంచి దూరంగా ఉంటోంది. దీంతో మద్యానికి బానిసైన లింగేశ్వరరావు మనస్తాపంతో రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లిగూడెం జీఆర్పీ ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
● పోలీసుల అదుపులో
ముగ్గురు యువకులు
● భారీ ఎత్తున సరుకు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment