![శివరాత్రి దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06amp251-270002_mr-1738866989-0.jpg.webp?itok=ZQWo_PAm)
శివరాత్రి దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు
పలు ఆలయాల ఈఓలకు, అధికారులతో జేసీ నిశాంతి సమీక్ష
అమలాపురం రూరల్: ఈనెల 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో భక్తులకు మహాశివుని దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్‌లో అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, మందపల్లి శనైశ్చరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి, కోటిపల్లి సోమేశ్వరస్వామి, అమలాపురం వెంకటేశ్వరస్వామి దేవస్థానం, పలివెల ఉమా కోప్పేశ్వర స్వామి ఆలయం, ర్యాలి జగన్మోహిని దేవస్థానం, మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానాల అధికారులతో సమీక్షించారు. ఆయా ఆలయాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, అదనపు సిబ్బంది, వసతుల కల్పన వంటి సహకారానికి ముందుగానే ప్రతిపాదనలు పంపితే అందుకు తగిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం సమకూరుస్తుందన్నారు. స్నాన ఘట్టాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ బీఎల్‌ఎన్ రాజకుమారి, దేవదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ డీఎల్వి రమేష్, వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ఎన్‌ఎస్ చక్రధరరావు, ద్రాక్షారామ, భీమేశ్వరస్వామి దేవ స్థానం కార్యనిర్వాహక అధికారి ఏవీ దుర్గా భవాని, అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి దేవస్థానం, అప్పనపల్లి బాల బాలాజీ దేవస్థానం కార్యనిర్వహక అధి కారి ముదునూరి సత్యనారాయణ రాజు, వివిధ దేవస్థానాల ఈవోలు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment