![అమ్మమ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06tun142f-270072_mr-1738866988-0.jpg.webp?itok=q8CjRqP5)
అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు..
గోకవరం/తొండంగి: రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని దుఃఖాన్ని నింపింది. ఒక్కగానొక్క కుమారుడిపై ఆ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. మండలంలోని బెండపూడికి చెందిన బూసాల రామకృష్ణ, గౌరీదేవిలకు కుమారుడు బూసాల సతీష్ (18), కుమార్తె మణి దీపిక ఉన్నారు. తుని మండలం తేటగుంటలో ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తూ ఆ పిల్లలను పోషిస్తున్నాడు రామకృష్ణ. రాజమహేంద్రవరం గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సతీష్ గోకవరం మండలం కామరాజుపేటలో ఉన్న తన అమ్మమ్మ నీటిపల్లి సత్యవతిని చూసేందుకు నాలుగు రోజుల క్రితం వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం తన స్నేహితుడితో కలసి బైక్ స్వగ్రామానికి తిరిగి వస్తుండగా కొత్తపల్లి శివారు ఆదర్శ ఫార్మశీ కళాశాల సమీపంలో భారీ మలుపు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. స్థానికులు సతీష్‌ను గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతని స్నేహితుడు స్వల్ప గాయాలతో బటయపడ్డాడు. నాలుగు రోజుల పాటు ఎంతో సరదాగా గడిపిన మనవడు మృత్యువాత పడడంతో అమ్మమ్మ సత్యవతి బోరున విలపించడం చూపరులను కలచివేసింది. మరో వైపు తన స్వగ్రామం బెండపూడిలో ఎంతో ఆల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు ప్రయోజకుడై తమకు అండగా ఉంటాడని ఆశ పడితే అందని తీరాలకు పోయి శోక ం మిగిల్చాడని తండ్రి రామకృష్ణ, తల్లి గౌరీదేవి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అందరితో సరదాగా ఉండే సతీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బెండపూడిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్సై పవన్‌కుమార్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కొత్తపల్లిలో
రోడ్డు ప్రమాదం
బీటెక్ విద్యార్థి మృతి
కన్నీరు మున్నీరైన
కుటుంబ సభ్యులు
![అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు..1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06tun141-270072_mr-1738866988-1.jpg)
అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంత లోకాలకు..
Comments
Please login to add a commentAdd a comment