పంచాయతీ కార్యదర్శులకు సర్టిఫికెట్లు ఇస్తున్న డీపీఓ విశ్వనాథ్
ఏలూరు(మెట్రో): పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. ఏలూరులో ఆ దివారం కార్యదర్శుల శిక్షణ తరగతుల ము గింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల అమలులో మానవీయకోణం ఉండాలన్నారు. నెల రోజుల నుంచి జిల్లాలోని 858 మంది కార్యదర్శులకు ఐదు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పంచాయతీ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల అమలు, అక్రమ నిర్మాణాలు, సర్వీసు నిబంధనలు, విద్యా, వైద్యం, పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామ సచివాలయం, వలంటీర్ వ్యవస్థ, సమాచార హ క్కు, ఉపాధి హామీ అమలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఏలూరు జిల్లా నుంచి 484 మంది, పశ్చిమగోదావరి జిల్లా నుంచి 374 మంది కార్యదర్శులు హాజరయ్యారన్నారు. శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వం రూ.30 లక్షల విడుదల చేసిందని, ఒక్కో కార్యదర్శికి రూ.6,500 చొప్పున ఖర్చు చేశామన్నారు. నాలుగు కేంద్రాల్లో శిక్షణ నిర్వ హించామన్నారు. శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి పంచాయతీరాజ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జె.మురళి, ఏలూ రు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, కోర్సు పరిశీలకుడు దోసి రెడ్డి, జెడ్పీ సీఈఓ రవికుమార్ సహకారం అందించారని డీపీఓ విశ్వనాథ్ అన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న కార్యదర్శులకు సర్టిఫికెట్లు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment