అగ్నిమాపక అధికారుల దందా
వార్డు సభ్యురాలిపై దాడి
పూళ్ల శివారు సాయన్నపాలెంలో వైఎస్సార్ సీపీ వార్డు సభ్యురాలిపై ఓ వర్గానికి చెందిన నలుగురు దాడి చేశారు. ఆమెకు భీమడోలు ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. 8లో u
ఏలూరు టౌన్: ఏలూరులో అగ్నిమాపక శాఖ అధికారులకు మామూళ్లు ఆలస్యం కావటంతో సోమవారం రాత్రి ఇవ్వాల్సిన అనుమతులు వాయిదా వేశారు. అనుమతుల జాప్యంతో దుకాణదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనుమతులు ఇవ్వలేదనే సాకుతో పోలీస్ అధికారులు ఇండోర్ స్టేడియం గేట్లకు తాళాలు వేశారు. బాణసంచా వాహనాలు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల వరకూ గేట్లు తెరుచుకోలేదు. గ్రౌండ్‌లో షాపులు అడ్డుగా ఉన్నాయంటూ హడావుడి చేయటంతో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇదంతా మామూళ్ల కోసమేనా? అని దుకాణదారులు చర్చించుకుంటున్నారు. ఇండోర్ స్టేడియంలో మొత్తం 48 బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. లైసెన్సు ఇవ్వటం నుంచి అధికారులను మేనేజ్ చేయటం వరకూ అంతా కమిటీ చూసుకుంటుంది. ఒక్కో షాపు నిర్వహణకు సుమారుగా రూ.70 వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దుకాణం కోసం రూ.29 వేలు, షాపు ఇచ్చేందుకు రూ.12 వేలు, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్ వారికి రూ.10 వేలు వెచ్చించాల్సిందే. జీఎస్‌టీ రూ.19500, పనిచేసేందుకు ఇద్దరు, ముగ్గురు పనివాళ్ళను పెట్టుకుంటే రూ.15 వేలు ఇలా ఖర్చు తడిసి మోపెడు అవుతుందని దుకాణదారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment