యలమంచిలి: బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ వివాహిత మృతి చెందింది. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాలివి. యలమంచిలి మండలం దొడిపట్ల గ్రామానికి చెందిన ముచ్చర్ల భాగ్యలక్ష్మి (33) గ్రామంలోని జగనన్న కాలనీలో ఉంటోంది. వారి డాబా ఇంటి మీదుగా హెచ్‌టీ విద్యుత్ తీగలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం డాబాపై బట్టలు ఆరేస్తుండగా హెచ్‌టీ విద్యుత్ తీగలు ఆకర్షించడంతో ఆమె విద్యుదాఘాతానికి గురై మరణించింది. భర్త ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుర్రయ్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment