హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్ట్
భీమవరం : మహిళ హత్యాయత్నం కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు భీమవరం టూటౌన్ సీఐ జి కాళీచరణ్ బుధవారం చెప్పారు. కేసుకు సంబంఽధించిన వివరాలిలా ఉన్నాయి. భీమవరం పట్టణంలోని శ్రీరామపురం ప్రాంతానికి చెందిన భూపతిరాజు ఉదయ్‌శేఖర్‌రాజు, మధు 2013లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు గగన్‌వెంకట్ లలిత్‌క్రిష్‌వర్మతో ఉన్నారు. భార్య, భర్తల మధ్య గొడవలు రావడంతో 2016లో విడిపోయారు. దీనితో 2022లో భీమవరం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం కేసు కోర్టులో విచారణలో ఉంది. టూటౌన్ ప్రాంతంలో మధు తన కుమారుడితో కలిసి నివాసముంటోంది. ఈనెల 27వ తేదీన ఆమె నివాసముంటున్న ఇంటి వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమెను పిలవడంతో ఇంటిలోంచి బయటకు రాగానే ఒక వ్యక్తి చాకుతో దాడి చేసేందుకు యత్నించాడు. ఆపదను గ్రహించిన మధు బిగ్గరగా కేకలు వేస్తూ వారిలో ఒకరిని పట్టుకునే ప్రయత్నం చేయగా అతని చొక్కా జేబులోనుంచి ఆధార్‌కార్డు పడిపోగా చాకు కిందపడేసి అంతా పారిపోయారు. హత్యాయత్నం జరిగిన తరువాత భయంతో ఆమె గణపవరం మండలం అర్ధవరం గ్రామంలోని తల్లివద్దకు వెళ్లారు. హత్యాయత్నం ఘటనపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త భూపతిరాజు ఉదయ్‌శేఖర్‌రాజుతోపాటు అతని బంధువులు రవికుమార్‌రాజు, లక్ష్మి, బాపిరాజుపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో కేసు దర్యాప్తు చేసి ఉదయ్‌శేఖర్‌రాజుతోపాటు కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం ముంజులూరుకు చెందిన కె నాగవెంకటవీర్రాజు, గుడివాడకు చెందిన కర్రా లాజర్, గుల్లపల్లి పోతురాజు, యలమర్తి నాని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బంగారుగూడెనికి చెందిన షేక్ సర్వర్‌పాషాలను అరెస్టు చేసి కోర్డులో హాజరుపర్చినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment