ఆరోగ్యశ్రీ నిధులు స్వాహా..!
పాలకొల్లు అర్బన్: పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధులు స్వాహా అయ్యాయి. ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి.. గతంలో పనిచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు రూ.62 లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది. గతంలో డా. సి గీతాకుమారి సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆమె సంతకాలు ఫోర్జరీ చేసి సదరు ఉద్యోగి రూ.28 లక్షలు డ్రా చేసినట్లు సమాచారం. ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి వచ్చిన ఆరోపణల కారణంగా గీతాకుమారిని సూపరింటెండెంట్ బాధ్యతలనుంచి తప్పించారు. ఆమె స్థానంలో డా.ప్రభాకరరావు సూపరింటెండెంట్‌గా వచ్చారు. ఆయన ఇటీవల గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన సంతకం కూడా ఫోర్జరీ చేసి రూ.34 లక్షలు డ్రా చేసినట్లు సమాచారం. ప్రభాకరరావు మరణం తరువాత ఇన్‌చార్జిగా డా.రవికుమార్ బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నిధులపై ఆరా తీసి తేడాలు జరిగినట్లు నిర్ధారించారు. దీనిపై ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిధులు స్వాహా చేసినట్లు అనుమానిస్తున్న ఆ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రవికుమార్‌ను వివరణ కోరగా ఆరోగ్య శ్రీ నిధులు దారి మళ్లిన విషయం వాస్తవమేనన్నారు. అయితే ఎంత నిధులు డ్రా చేశారో తెలియదని, దీనిపై పోలీసు కేసు పెట్టినట్లు చెప్పారు.
హైవే పక్కనే మద్యం దుకాణం ఏర్పాటు
నూజివీడు: నూజివీడు మండలం మీర్జాపురంలో నిబంధనలకు విరుద్ధంగా హైవేపైనే మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హైవేకు 250 మీటర్ల దూరంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలి. కానీ మచిలీపట్నం – కల్లూరు – నూజివీడు (నేషనల్ హైవే 216 హెచ్) రహదారి పక్కనే మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. సంబంధిత ఎకై ్సజ్ అధికారులు ఈవిషయం పట్టించుకోకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్ వర్సిటీ సౌత్‌జోన్ పోటీలకు ఎంపిక
జంగారెడ్డిగూడెం : స్థానిక చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న పి.లోవబాబు ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డా. ఎన్.ప్రసాద్‌బాబు తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీఏట్ మండపేటలో నిర్వహించిన కబడ్డీ జట్టులో పాల్గొని ప్రతిభ కనబర్చడంతో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టీమ్‌కి ఎంకై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రసాద్‌బాబు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వినయ్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థి లోవబాబును అభినందించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఏలూరు ఇండోర్ స్టేడియం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలు బుధవారం ముగిశాయి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, యోగ, మ్యూజిక్, స్విమ్మింగ్ తదితర అంశాల్లో జట్లు ఎంపిక పూర్తి చేసినట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి బి శ్రీనివాస్ తెలిపారు. 200 మంది ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొన్నారని వివరించారు. ఎంపికై న జట్లు నవంబర్ 6 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు.
పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ చేతివాటం
ఫోర్జరీ సంతకాలతో రూ.62 లక్షల వరకు స్వాహా
Comments
Please login to add a commentAdd a comment