స్కూల్ లాగిన్‌లో పేరు మార్పునకు అవకాశం
నిడమర్రు: అపార్‌కు ఆధార్ గ్రహణం శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఆధార్, స్కూల్ రికార్డుల్లో చిన్న వ్యత్యాసం ఉన్నా కార్డు జనరేట్ అవ్వడం లేదని వచ్చిన వార్తకు స్పందనగా ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం మంగళవారం మండల, డివిజినల్ స్థాయి విద్యాశాఖాధికారులతో గూగూల్ మీట్ ఏర్పాటు చేశారు. స్కూల్ రికార్డులోని పేరు మార్పునకు యూడైస్ ప్లస్ వెబ్‌సైట్‌లో స్కూల్ లాగిన్‌లోనే స్టూడెంట్ నేమ్ చేంజ్ ఆప్షన్ ఎనేబుల్ చేసినట్లు తెలిపారు. దీంతో యూడైస్‌లో విద్యార్థి పేరులో తప్పులు సరి చేసుకోవడానికి ఎంఈవో కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. ఆధార్‌లో పేరు సరిచేసుకునేందుకు ప్రత్యేక ఆధార్ శిభిరాలు పాఠశాలల ప్రాంగణాల్లో/పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment