ఏలూరు టౌన్: సంతానం కలుగలేదని తీవ్ర మనస్థాపానికి గురైన ఒక యువకుడు పురుగుమందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ మండలం బూరాయిగూడానికి చెందిన కాటి కిషోర్ (25)కు మౌనికతో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరికి సంతానం కలుగకపోవడంతో మానసికంగా బాధపడుతున్న కిషోర్ ఈనెల 17వ తేదీన పురుగుమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వైద్యులు ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏలూరు రూరల్ ఎస్సై సీహెచ్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment