రియల్ కష్టాలే !
ట్రిపుల్ ఐటీ ఔదార్యం
విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం కృషి చేస్తోంది. అనూష బ్రెయిన్ స్ట్రోక్‌తో పడిపోగా వెంటనే ఆస్పత్రిలో చేర్పించి రూ.2 లక్షలు చెల్లించారు. 8లో u
బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ
మంగళవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ఏలూరులో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొత్త ఏడాది కూటమి సర్కారు భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే మందకొడిగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ నిర్ణయంతో పడకేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే పట్టణ, మండల కేంద్రాల శివార్లలోని వెంచర్లను టార్గెట్ చేస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయా ప్రాంతాల్లోని భూములపై 10 నుంచి 25 శాతం పెంపు భారం పడనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఏలూరు జిల్లాలో 12, పశ్చిమగోదావరి జిల్లాలో 15 ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే రెండు జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు ఆయా జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమై పెంపు ప్రతిపాదనలపై సమీక్షించారు. ఏలూరు జిల్లాలో ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్‌న్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఖరారయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సబ్ రిజిస్ట్రార్ వర్గాలు తెలిపాయి. కొన్నేళ్లుగా పట్టణ జీవనానికి ప్రజలు మొగ్గు చూపుతుండటంతో పల్లెల నుంచి సమీప పట్టణాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే క్రమంలో పట్టణ, మండల కేంద్రాల సమీప గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. లే అవుట్లలో రిజిస్ట్రేషన్లు అధికంగా జరుగుతుండటంతో వీటిని లక్ష్యంగా చేసుకుని పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అర్బనన్ ఏరియాల్లో రిజిస్ట్రేషన్ల పెంపు 10 నుంచి 20 శాతం వరకు ఉంటే రూరల్ ఏరియాల్లో 25 శాతం వరకు పెంచడం గమనార్హం. వీటి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.
అగమ్యగోచరంగా రియల్టర్ల పరిస్థితి
ఇప్పటికే అమ్మకాలు లేక కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం తాజా పెంపుతో పూర్తిగా పతనమవుతుందని ఆ వర్గాలంటున్నాయి. ఇప్పటికే ఎంతోకొంత భూమిని వెనకేసుకున్న వారు తమ బిడ్డల చదువులు, వివాహాలు, ఇతర అవసరాల నిమిత్తం అమ్మజూపినా కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క కోట్లాది రూపాయలు వెచ్చించి సొంత భూములను వెంచర్లుగా మార్చిన వారు, అప్పులు చేసి డెవలప్ చేసిన వెంచర్లలో స్థలాల కొనుగోళ్లు లేక రియల్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. భూములను డెవలప్‌మెంట్‌కు తీసుకుని వెంచర్లు వేశాక అవి అమ్ముడుకాకపోతుండటంతో సంబంధిత భూ యజమానుల నుంచి రియల్టర్లు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్న మధ్యవర్తులు, దళారుల కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. గతంలో నెలకు ఒక్క ప్లాటు అయినా విక్రయిస్తే.. గత ఆరు నెలలుగా ఒక్క ప్లాటు కూడా విక్రయించలేని పరిస్థితి. ఇప్పుడే పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే రిజిస్ట్రేషనన్‌్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న ఆందోళనలో ఉన్నారు.
బంగారం వ్యాపారి అరెస్టు
పలువురు జ్యూయలర్స్ నుంచి బంగారం, వెండితో ఉడాయించిన బంగారం వ్యాపారిని తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. 8లో u
జిల్లాలో పెరగనున్న భూముల విలువ
మండలం అర్బన్ రూరల్
(శాతం) (శాతం)
భీమడోలు 0–15 0–15
చింతలపూడి 10–15 10–15
జంగారెడ్డిగూడెం 0–15 0–15
కామవరపుకోట 10–20 10–25
పోలవరం 10–20 10–25
వట్లూరు 0–15 0–15
ఏలూరు 0–10 10–15
గణపవరం 10–15 10–15
కై కలూరు 10–20 10–25
మండవల్లి 10–20 10–20
ముదినేపల్లి 10–20 10–20
నూజివీడు 10–20 10–20
న్యూస్‌రీల్
ఆదాయార్జనే లక్ష్యంగా రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు
10 నుంచి 25 శాతం పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం
ఉమ్మడి జిల్లాలో భారీగా పెరగనున్న భూముల ధరలు
కొన్ని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ కన్నా ప్రభుత్వ ధరే ఎక్కువ
ఇప్పటికే పడకేసిన రియల్ ఎస్టేట్ రంగం
తాజా పెంపుతో పతనం తప్పదంటున్న రియల్ ఎస్టేట్ వర్గాలు
భూముల ధరల పెంపు ఉపసంహరించుకోవాలి
ప్రజలపై భారం మోపుతూ జనవరి 1 నుంచి భూముల ధరలు పెంచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. భూముల ధరలు పెంచడం వల్ల కొనుగోలుదారులు తగ్గిపోతారు. దీనివల్ల ఈ రంగంపై ఆధారపడిన మీడియేటర్లు, రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కక్షిదారులకు వివిధ విధాలుగా సేవలందించే ఎంతోమంది డాక్యుమెంట్ రైటర్లు, వారి సహాయకులు, డీటీపీ ఆపరేటర్లు ఉపాధి కోల్పోతారు.
–గంటా రాజేశ్వరరావు (తంబి), రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
సాధారణంగా భూముల ప్రభుత్వ మార్కెట్ ధరకు బయటి మార్కెట్ ధరకు 50 నుంచి 70 శాతం వ్యత్యాసం ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో గజం రూ.20 వేలు ఉంటే ప్రభుత్వ రికార్డుల్లో ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్యలో ఉంటుంది. ప్రజలు భూములు కొనేటప్పుడు ప్రభుత్వ రికార్డుల ధరలకే స్టాంప్ డ్యూటీ చెల్లిస్తారు కాబట్టి వారికి లబ్ధి చేకూరేది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కొన్నిచోట్ల బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వ రికార్డుల్లో ధరలు అధికంగా ఉంటున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఏలూరు పరిసర ప్రాంతాలైన పోణంగి టిడ్కో గృహ సముదాయం సమీపంలో బహిరంగ మార్కెట్‌లో గజం రూ.5 వేలు పలుకుతుండగా ప్రభుత్వ రికార్డుల్లో రూ.12 వేలుగా ఉంది. బూరాయగూడెంలో బహిరంగ మార్కెట్‌లో రూ.5 వేలు, ప్రభుత్వ రికార్డుల్లో రూ.12 వేలు, శాంతినగర్ వెనక దర్శ నగర్‌లో బహిరంగ మార్కెట్‌లో రూ.8 వేల నుంచి 10 వేలు ఉన్న ధర ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం రూ.22 వేలుగా ఉంది. వంగాయగూడెం నుంచి కై కలూరు వెళ్ళే దారిలో బహిరంగ మార్కెట్‌లో రూ. 12 వేలు ఉంటే ప్రభుత్వ రికార్డుల్లో రూ.43 వేలు ఉంది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలోని విస్సాకోడేరు, రాయలంలో బయటి మార్కెట్ విలువ గజం రూ.10 వేల వరకు ఉండగా ప్రస్తుత ప్రతిపాదిత ధర రూ.15 వేల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంత శివార్లు, ఉమ్మడి జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇలాంటి వ్యత్యాసాలు అధికంగానే ఉంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment