ముసాయిదా కాపీల దహనం
ఏలూరు(టూటౌన్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణం రద్దు చేయాలని, రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముసాయిదా కాపీలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంఘం (అన్నే భవనం) రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతు సంఘం (స్ఫూర్తి భవనం) రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోరండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకుడు రాజనాల రామ్మోహన రావు, ఏఐకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డిహెచ్. రంగనాథం, రైతు కూలీ సంఘం(ఆంధ్ర ప్రదేశ్) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్.కె.బాషా, బికేయంయు జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు కె.వి రమణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస డాంగే తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment