కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్‌ | - | Sakshi
Sakshi News home page

కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్‌

Published Wed, Dec 25 2024 1:58 AM | Last Updated on Wed, Dec 25 2024 1:58 AM

కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్‌

కరుణ, త్యాగానికి ప్రతీక క్రిస్మస్‌

ఏలూరు(మెట్రో): క్రిస్మస్‌ పండుగని పురస్కరించుకుని జిల్లాలో ని క్రైస్తవులకు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపా రు. బైబిల్‌లోని ప్రేమ, క్షమాగుణం, దయాతత్వం, శాంతితత్వం ప్రతిఒక్కరూ కలిగివుండాలన్నారు. నిస్సహాయులపై కరుణ చూపాలని శతాబ్దాల క్రితమే క్రీస్తు ప్రబోధించారని ఆమె గుర్తుచేశారు. క్రిస్మస్‌ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.

టీడీపీ నేత ఆధ్వర్యంలో పేకాట శిబిరం !

ఏలూరు టౌన్‌: ఏలూరు రూరల్‌ ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. రూరల్‌ ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 30 మందికి పైగా పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి సుమారు రూ.8.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏలూరు రూరల్‌ ఎస్‌ఎంఆర్‌ నగర్‌లో ఒక టీడీపీ నాయకుడి ఆధ్వర్యంలో ఈ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పట్టుబడిన వారిలో టీడీపీ నాయకులు ఉన్నట్లు సమాచారం. టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకోవటంతో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పోలీస్‌ అధికారులు మాత్రం పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని చెబుతున్నారు. ఈ పేకాట శిబిరంలో కొత్త తరహాలో గంటకు వడ్డీకి డబ్బులు ఇస్తూ పేకాట బోర్డు నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. పేకాట ఆడేందుకు వెళ్లిన వారు డబ్బులు పోయినా వెంటనే గంటకు వడ్డీ లెక్కన డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఇద్దరు నేతలు రెడీగా ఉంటారని తెలుస్తోంది.

తత్కాల్‌లో పరీక్ష ఫీజులు చెల్లించే అవకాశం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు తత్కాల్‌ విధానంలో ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1000 అపరాధ రుసుంతో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకూ ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షలకు రెగ్యులర్‌, గతంలో అనుత్తీర్ణులై ప్రస్తుతం ప్రైవేట్‌గా హాజరు కాగోరు అభ్యర్థులకు ఈ వివరాలు తెలిపి ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

349 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో 28 మండలాల్లో మొత్తం 665 రెవెన్యూ గ్రామాలుండగా ఇంతవరకు 349 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. జిల్లాలో మంగళవారం నిర్వహించిన 27 రెవెన్యూ సదస్సుల్లో 212 మంది పాల్గొని ఆయా సమస్యలపై అర్జీలను అందజేయగా వాటిలో అప్పటికప్పుడే 86 అర్జీలు పరిష్కరించామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో అందిన విజ్ఞప్తులను 45 రోజుల్లోగా పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇంతవరకు నిర్వహించిన 349 గ్రామ రెవెన్యూ సదస్సులకు 15,123 మంది హాజరై 3,734 అర్జీలు అందజేయగా ఇప్పటికే 938 అర్జీలు పరిష్కరించామన్నారు.

శిక్షణకు పలువురు జడ్జీలు

ఏలూరు (టూటౌన్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న పలువురు జడ్జీలు ఏపీ జ్యుడీషియల్‌ అకాడమీకి 10 వారాల శిక్షణ కోసం వెళ్లనున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్‌ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 20 నుంచి మార్చి 28 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచి శిక్షణకు ఎంపికై న వారిలో వి.రఘునాఽథ్‌, ఫస్ట్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి, కె.స్పందన, స్పెషల్‌ జ్యూడీషియల్‌ మేజిస్ట్రేట్‌, ఎకై ్సజ్‌ కోర్టు, టి.ఆంజనేయ ఎస్‌ఎస్‌ రామ ఆదిత్య రిషిక్‌, సివిల్‌ జడ్జి, భీమడోలు, ఏ.వెంకట నాగరాజు, సెకండ్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి, తణుకు, డి.అరుంధతి, ఫస్ట్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి, తాడేపల్లిగూడెం, జొన్నలపల్లి బీటీఎస్‌ దేవి, ఫస్ట్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి, కొవ్వూరు ఉన్నారు.

ఇరిగేషన్‌ స్థలం పరిశీలన

కాళ్ల: ప్రభుత్వ అవసరాల కోసం కాళ్ళ మండలం పెదఅమిరం మహాత్మా గాంధీ క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దగ్గరలో నీటిపారుదల శాఖకు సంబంధించిన మూడున్నర ఎకరాల భూమిని సంబంధిత శాఖ అధికారులతో కలిసి జాయింటు కలెక్టరు టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ భూమికి సంబంధించిన మ్యాప్‌లు, స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం స్థలం పరిశీలించామన్నారు. ఇందుకు సంబంధించిన భూమి వివరాలపై పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement