విద్యుత్ పోరుబాటను విజయవంతం చేయాలి
వైఎస్సార్‌సీసీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్
కైకలూరు: కరెంటు చార్జీల బాదుడుపై పోరుబాటను ఈ నెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) పిలుపునిచ్చారు. పోరుబాట కార్యక్రమంపై వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కై కలూరు రైల్వేస్టేషన్ సమీప పార్టీ కార్యాలయం నుంచి ఏలూరు రోడ్‌లో విద్యుత్‌శాఖ డీఈ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ చేసి డీఈకి వినతిపత్రం అందించాలన్నారు. ఎన్నికల సమయంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచనని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల్లో రూ.15,485.36 కోట్ల విద్యుత్ చార్జీల బాదుడు విధించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఎగనామం పెట్టరన్నారు. ఇప్పటికే 9 గంటల ఉచిత విద్యుత్‌ను 6 గంటలకు కుదించారని పేర్కొన్నారు. పోరుబాటను విజయవంతం చేయాలని డీఎన్నార్ కోరారు. ఆటపాక, పల్లెవాడ, పులపర్రు, ఆచవరం ఎంపీటీసీలు తమ్మిశెట్టి లక్ష్మీ, సాదు కొండయ్య, దారా రమేష్, బుర్ల నాగరాజు, మండల కో ఆప్షన్ సభ్యులు సోమల శ్యాంసుందర్, పార్టీ నాయకులు ఉచ్చుల చిన్ని రాజు, షేక్ రఫీ, పంజా రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment