ఆత్మీయ కలయిక
నూజివీడు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతాప్ అప్పారావు వివరించారు.
వేణుగోపాలరావుకు వైఎస్సార్ సీపీ జిల్లా పదవి
ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కై కలూరు నియోజకవర్గానికి చెందిన ఎలుగుల వేణుగోపాలరావును పార్టీ ఏలూరు జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కుక్కునూరులో గ్రామసభ
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు 41.15వ కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గ్రామాల నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే దిశగా బుధవారం కుక్కునూరులో ఐటీడీఏ పీవో రాముల నాయక్ గ్రామసభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో 41.15వ కాంటూర్ పరిధిలో ఆర్‌అండ్‌ఆర్ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ కాంటూరు పరిధికి సంబంధించి కటాఫ్ తేదీకి 18 సంవత్సరాలు నిండిన వారు, వాట్సప్ మెసేజ్‌లతో ఆర్‌అండ్‌ఆర్ జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వాళ్లు, ఇతర కారణాలతో ఆర్‌అండ్‌ఆర్ రాని వాళ్లు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, పదో తరగతి మార్కుల మెమో, ఇంటి రసీదులు, భూమి ఉంటే భూమి పత్రాలు, ప్రస్తుత కరెంట్ బిల్లులు తదితర ఆధారాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.రమేష్, ఎంపీడీవో నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విజేతగా ఏలూరు ఐటీఐ విద్యార్థి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గతేడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో రాష్ట్ర విజేతగా ఏలూరు ఐటీఐ కళాశాల విద్యార్థి కాట్రు సిద్ధూ నిలిచాడని ఐటీఐ ప్రధానాధికారి పీ.రజిత తెలిపారు. ఎలక్ట్రికల్ ఇన్‌స్టలేషన్ విభాగంలో సిద్ధూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడన్నారు. సిద్ధూకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీ. గణేష్ కుమార్ గత జనవరి 30వ తేదీన ప్రశంసాపత్రం, రూ.30 వేల నగదు పురస్కా రం అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధూను ప్రధానాధికారి రజిత, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు అభినందించారు.
ఇంటర్ రప్రాక్టికల్స్ ప్రారంభం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం ప్రయోగ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఒకేషనల్ విద్యార్థులకు తొలిరోజు 14 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 1737 మందికి గాను 1461 మంది హాజరు కాగా 276 మంది గైర్హాజరయ్యారు. వీరిలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 1010 మందికి గాను 810 మంది హాజరు కాగా 200 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 727 మందికి గాను 651 మంది హాజరు కాగా 76 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే చంద్రశేఖర బాబు తెలిపారు.
12న మన్యం బంద్
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 యాక్ట్‌పై మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్య లను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్‌కు పిలుపు నిచ్చారు. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment