మద్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించండి | Sakshi
Sakshi News home page

మద్యం అక్రమ రవాణా అడ్డుకట్టకు సహకరించండి

Published Tue, May 7 2024 11:25 AM

-

జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి

గుంటూరు వెస్ట్‌: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమ మద్యం సరఫరా కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, దీనికి రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి కోరారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీడియా సమావేశ మందిరంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రశాంత ఎన్నికల నిర్వహణే ధ్యేయంగా కృషి చేస్తున్నామని చెప్పారు. అక్రమ మద్యం కారణంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందన్నారు. అక్రమ మద్యం అరికట్టేందుకు నిఘా పెంచామన్నారు. ఇప్పటి వరకు 8,325 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. జిల్లాలోని 102 మద్యం రిటైల్‌ ఔట్‌లెట్లు, 102 బార్లు, 9 క్లబ్స్‌లో మద్యం అమ్మకాలు సరఫరాపై నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లైవ్‌ను అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎకై ్సజ్‌ అధికారులు నిఘాతో పాటు, చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా ఉంచామని పేర్కొన్నారు. అక్రమంగా నిల్వ చేసే మద్యం పట్టుబడితే సరఫరా చేసిన వారిపైనా చర్యలుంటాయని హెచ్చరించారు. పార్టీల నాయకుల సహకారంతోనే ఇప్పటి వరకు జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొందని, రానున్న వారం రోజులు వారి సహకారం కొనసాగించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. సమావేశంలో డీఆర్వో పెద్ది రోజా, అడిషనల్‌ ఎస్పీలు రమణ మూర్తి, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి వెంకట రామి రెడ్డి పాల్గొన్నారు.

రూ.3 కోట్లు స్వాధీనం..

ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నిఘా బృందాలు స్వాధీనం చేసుకున్న నగదు, అక్రమ మద్యం, ఉచిత వస్తువుల విలువ సోమవారం నాటికి రూ.3,17,17,881 చేరింది. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టుల్లోనూ, వాహనాల తనిఖీల ద్వారా, అందిన సమాచారం తదితర మార్గాల్లో నిఘా బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement