పోలీసులతో కలిసి టీడీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారు
డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ నాయకులు
భట్టిప్రోలు: టీడీపీ నాయకులు పోలీసులతో కలసి తమను హతమార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి పీజీ అరుణ్‌శాస్త్రి, వైఎస్సార్ సీపీ నాయకులు గోలి శ్రీనివాసరావు, మోర్ల కోటేశ్వరరావులు మంగళవారం తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, ఎస్‌ఐ శివయ్యతో సోమవారం రాత్రి సుధీర్ఘ మంతనాలు జరిపినట్లు బాధితులు ఆరోపించారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్న పోలీస్ అధికారులు, టీడీపీ నాయకులు తూనుగుంట్ల సాయిబాబా నుంచి తమకు తగు రక్షణ కల్పించాలని బాధితులు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.
జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక
ఐలవరం(భట్టిప్రోలు): నెల్లూరు జిల్లా దర్గామిట్టా బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ఏ యోగా పోటీలలో భట్టిప్రోలు మండలం ఐలవరం జెడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుచున్న కె.సంపత్ సత్తా చాటాడు. తద్వారా జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment