గ్రామీణ ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణాభివృద్ధికి ఆర్థిక పరిపుష్టి, స్వయం పరిపాలనకు దోహదం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ, రాష్ట్రీయ స్వరాజ్ అభియాన్, డీపీఆర్సీ ఆధ్వర్యంలో 2025–26 పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై జిల్లాస్థాయిలో శిక్షణ నిర్వహించారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా ఈ నెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మంగళవారం పల్నాడు జిల్లా పరిధిలోని 28 మండలాల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమాన్ని ప్రారంభించి సీఈవో మాట్లాడుతూ... శిక్షణ పొందిన బృందం మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇస్తుందని వివరించారు. గ్రామాల ప్రగతి, ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధికి వీలుగా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందని అన్నారు. మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికలను కూడా ఆన్‌లైన్‌లో పంపాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ జేడీ ఆర్. కేశవరెడ్డి మాట్లాడుతూ పంచాయతీ ప్రణాళికలు ఎంతో ముఖ్యమని చెప్పారు. డీపీవోలు కె. నాగసాయికుమార్, ఎంవీ భాస్కరరెడ్డి, డీపీఆర్సీ జిల్లా సమన్వయకర్త ఎస్. పద్మారాణి, రీసోర్స్ పర్సన్లు ఎస్. నిరంజన్‌రావు, షేక్ కరీముద్దీన్, కె. అనూరాధ, జిల్లా కన్సల్టెంట్ కె. జోసఫ్, జిల్లా టైమింగ్ మేనేజర్ కె. నాగేశ్వరరావు, డి. రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు
Comments
Please login to add a commentAdd a comment