పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): సరస్వతీ భూములపై జనససేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అవాస్తవాలను మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ అధ్యాపక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని పేర్కొన్నారు. సరస్వతీ భూములు కొనుగోలు చేసి 20 సంవత్సరాలకుపైగా గడిచిందని, ఉద్యోగాలు, ఉపాధి వస్తాయనుకున్న రైతులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్న మాటల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఆ భూములు రైతుల నుంచి వారి ఇష్ట ప్రకారం వారు ఆశించిన ధర కంటే అధికంగా చెల్లించి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ భూములను 40 ఏళ్ళ నాడు సాంఘి, అంబుజా సిమెంట్స్, మై హోమ్స్ వంటి వారికి దోచిపెట్టిన గత ప్రభుత్వాల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కొనుగోలు చేసిన భూములపై ఉద్దేశపూర్వకంగానే నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్‌పై ఎన్ని నిందలు మోపినా.. ప్రజలు నమ్మరన్నారు. అక్కడ ఫ్యాక్టరీ కట్టకుండా అడ్డుకుంది చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్ వైఎస్ జగన్‌పై ఉక్రోషంతో వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. పర్యటనలు చేయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం తఽథ్యమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment