సచివాలయ వ్యవస్థపై స్పష్టత ఇవ్వాలి
రాష్ట్రంలోని సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తారా? లేదా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. సచివాలయ ఉద్యోగులను ఆయా మాతృశాఖల్లో పదోన్నతులు ఇస్తారా లేక వివిధ శాఖల్లో విలీనం చేస్తారా అనే విషయం తేల్చి చెప్పాలి. ప్రజలకు ప్రభుత్వం తరఫున వివిధ సేవలు అందించడానికి సచివాలయ ఉద్యోగులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. గత నాలుగు నెలల నుంచి సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తున్న వివిధ విధుల (పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీయడం, ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికించడం, ప్రతి ఇంటి జియో కో–ఆర్డినేట్స్ ట్యాగింగ్ చేసుకోవడం) వల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
– షేక్ అబ్దుల్ రజాక్, ఆంధ్రప్రదేశ్గ్రామ/వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment