ఏఎన్‌యూ అధ్యాపకులకు ‘ఉత్తమ’ అవార్డులు
ఏఎన్‌యూ: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డులకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆరుగురు అధ్యాపకులు ఎంపికయ్యారు. వీరిలో ఆచార్య ఎన్.వి.కృష్ణారావు (తెలుగు), ఆచార్య డి.రామచంద్రన్ (కెమిస్ట్రీ), ఆచార్య వై.అశోక్ కుమార్ (అంబేడ్కర్ చైర్), ఆచార్య ఎం.త్రిమూర్తి రావు (సోషల్ వర్క్), డాక్టర్ పి.పూర్ణచంద్రరావు (టూరిజం), డాక్టర్ పి.బ్రహ్మాజీరావు (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్)లు ఉన్నారు. వీరికి ఈ నెల 11వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లు అవార్డులను అందజేయనున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై న వారికి యూనివర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలిపారు. ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న కెమిస్ట్రీ అధ్యాపకుడు, దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్‌ను శనివారం దూరవిద్య కేంద్రంలో జరిగిన అభినందన కార్యక్రమంలో సన్మానించారు. దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment