రక్తనిధి కేంద్రానికి రూ.5లక్షల ఎంపీ నిధులు | - | Sakshi
Sakshi News home page

రక్తనిధి కేంద్రానికి రూ.5లక్షల ఎంపీ నిధులు

Published Sun, Nov 10 2024 1:37 AM | Last Updated on Sun, Nov 10 2024 1:37 AM

రక్తనిధి కేంద్రానికి రూ.5లక్షల ఎంపీ నిధులు

రక్తనిధి కేంద్రానికి రూ.5లక్షల ఎంపీ నిధులు

నరసరావుపేట: ప్రభుత్వ వైద్యశాలలో రెడ్‌క్రాస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కంజుల జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పూర్తయి త్వరలో ప్రారంభించబోతున్న కాంపోనెంట్‌ బ్లడ్‌సెంటర్‌కు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మరో రూ.5లక్షలు తన ఎంపీ నిధులు మంజూరుచేశారు. ఇప్పటికే ఆయన రూ.5లక్షలు ఇచ్చిన విషయం విధితమే. శనివారం బ్లడ్‌సెంటర్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సందర్శించారు. బ్లడ్‌సెంటర్‌ విశేషాలు, పరికరాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బ్లడ్‌సెంటర్‌కు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. రెడ్‌ క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ పీవీఎం శరత్‌ బాబు, కోశాధికారి జి.మురళికృష్ణ, మేనేజింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ రేహమతుల్ల, డాక్టర్‌ సృజన, కేఎంయన్‌వి శ్రీనివాసగుప్తా, బత్తుల మురళి, మాజీ కౌన్సిలర్‌ షేక్‌ మస్తాన్‌వలి, వైఎస్సార్‌ సీపీ నాయకులు పాలపర్తి వెంకటేశ్వరరావు, గంటెనపాటి గాబ్రియేలు, మూరే రవీంద్రరెడ్డి, కారుమంచి మీరావలి పాల్గొన్నారు.

ప్రకటించిన రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఇప్పటికే రూ.5 లక్షలు మంజూరు చేసిన ఎంపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement