శబరిమలకు ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Published Wed, Nov 20 2024 1:50 AM | Last Updated on Wed, Nov 20 2024 1:50 AM

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

శబరిమలకు ప్రత్యేక రైళ్లు

లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని శబరిమల భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ప్రదీప్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. వివరాలు...

● నెంబర్‌ 07143 మౌలాలి – కొల్లం రైలు వయా గుంటూరు డివిజన్‌ మీదుగా డిసెంబర్‌ 6, 13, 20, 27వ తేదీలలో ఉంటుంది. మౌలాలిలో ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

● నెంబరు 07144 కొల్లం–మౌలాలి రైలు డిసెంబర్‌ 8, 15, 22, 29వ తేదీలలో కొల్లం నుంచి అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మౌలాలి చేరుతుంది.

● నెంబరు 07145 మచిలీపట్నం–కొల్లం రైలు డిసెంబర్‌ 2, 9, 16 వ తేదీలలో మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుతుంది.

● నెంబరు 07146 కొల్లం–మచిలీపట్నం రైలు డిసెంబర్‌ 4, 11, 18వ తేదీలలో కొల్లం నుంచి అర్ధరాత్రి 2.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మచిలీపట్నం వస్తుంది.

● నెంబరు 07147 మచిలీపట్నం–కొల్లం రైలు డిసెంబర్‌ 23, 30వ తేదీలలో మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలు దేరి మరుసటి రోజు రాత్రి 9.20 గంటలకు కొల్లం చేరుకుంటుంది.

● నెంబరు 07148 కొల్లం–మచిలీపట్నం రైలు డిసెంబర్‌ 25వ తేదీన కొల్లంలో అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మచిలీపట్నం వస్తుంది.

● 07143, 07145, 07147 ప్రత్యేక రైళ్లకు ఈ నెల 20వ తేదీ నుంచి అడ్వాన్స్‌ బుకింగ్‌ ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement