నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలోని సాంఘిక సంక్షేమ వసతిగృహం(పరివర్తన భవన్)లో ఓ విద్యార్థిని శుక్రవారం రాత్రి పాపకు జన్మనిచ్చింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీ ఫార్మసీ చదువుకుంటూ కలెక్టరేట్ బంగ్లా రోడ్డులోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటోంది. శుక్రవారం రాత్రి విద్యార్థిని తన స్నేహితురాలి సాయంతో పాపకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే తల్లి, బిడ్డను జీజీహెచ్‌కు తరలించారు. హాస్టల్‌లో ఇంత జరుగుతున్నా వార్డెన్‌కు ఏమీ తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జరిగిన ఘటనపై ఏఎస్‌డబ్ల్యూవో చెంచులక్ష్మిని వివరణ కోరగా హాస్టల్ వార్డెన్‌కి విద్యార్థిని కడుపుతో ఉన్న విషయం తెలియదని, వార్డెన్ ఎప్పుడు అడిగినా ఆరోగ్యం బాగానే ఉందని చెబుతూ ఉండేదని చెప్పారు.
గుంటూరు నగరంలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment