పలు రైళ్ల సేవల్లో మార్పులు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని విజయవాడ–ఖాజీపేట మధ్య ఇంజినీరింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల సేవల్లో మార్పులు చేసినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ శనివారం వెల్లడించారు.
● నంబర్ 12705 గుంటూరు–సికింద్రాబాద్, 12706 సికింద్రాబాద్ – గుంటూరు రైళ్లు ఈ నెల 28, 29, జనవరి 2, 5, 7, 8, 9 రద్దు చేశారు.
● 07277 మిర్యాలగూడ–నడికుడి రైలు ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు, 07973 నడికుడి–మిర్యాలగూడ రైలు ఈ నెల 27 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు, 07974 మిర్యాలగూడ – కాచిగూడ రైలు ఈ నెల 27 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు, 07791 కాచిగూడ – నడికుడి, 07792 నడికుడి–కాచిగూడ రైళ్లు ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రద్దు అయ్యాయి.
పాక్షిక రద్దు
● నంబర్ 17201 గుంటూరు–సికింద్రాబాద్ రైలు, 17202 సికింద్రాబాద్–గుంటూరు రైలును ఈ నెల 27 నుంచి జనవరి 9వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు.
దారి మళ్లింపు...
● నంబర్ 18519 విశాఖటప్నం–ముంబయి ఎల్‌టీటీ రైలును ఈ నెల 26 నుంచి జనవరి 8వ తేదీ వరకు గుంటూరు మీదుగా దారి మళ్లించనున్నారు. 18045 షాలీమార్–హైదరాబాద్ రైలు జనవరి 6– 8వ తేదీ వరకు, 18046 హైదరాబాద్–షాలీమార్ రైలు 7– 9వ తేదీ వరకు, 17205 సాయినగర్ షిరిడీ – కాకినాడ పోర్ట్ రైలు 7వ తేదీన, 17206 కాకినాడ పోర్ట్ – సాయినగర్ షిరిడీ రైలు జనవరి 8వ తేదీన, 17208 మచిలీపట్నం–సాయినగర్ షిరిడీ రైలు జనవరి 7వ తేదీన, 11019 ముంబయి సీఎస్‌ఎంటీ–భవనేశ్వర్ రైలు జనవరి 6– 8వ తేదీ వరకు, 11020 భువనేశ్వర్–ముంబయి సీఎస్‌ఎంటీ రైలు జనవరి 6 – 8వ తేదీ వరకు, 22849 షాలీమార్–సికింద్రాబాద్ రైలు జనవరి 1, 8 తేదీల్లో, 20833 విశాఖపట్నం–సికింద్రాబాద్ రైలు జనవరి 8, 9 తేదీల్లో, 12774 సికింద్రాబాద్–షాలీమార్ రైలును జనవరి 7వ తేదీ వరకు గుంటూరు డివిజన్ మీదుగా దారి మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment