‘కిక్కు’రొక్కో
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కొక్కొరొకో అంటూ కోడి కూతతో నిత్యం వేకువ మొదలైతే ‘కిక్కు’రొకో అంటూ కొత్త వత్సరానికి ఆహ్వానం పలికేందుకు మందు బాబులు సిద్ధమవుతున్నారు. దీంతో న్యూ ఇయర్ నైట్ ఈవెంట్లలో మద్యపానానికి ఎకై ్సజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈవెంట్ మేనేజర్లు ప్రత్యేక ఆఫర్లతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. భారీ మొత్తంలో టికెట్ రేట్లు పెట్టి నగదు వసూలు చేస్తున్నారు. ఈ ఈవెంట్లకు కేవలం రూ.6వేల చలనాతో మద్యం దిగుమతి చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. దీంతో మద్యాన్ని పారించేందుకు నిర్వాహకులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నైట్ ఈవెంట్ల నిర్వహణ, మద్యపానం అనుమతి నిమిత్తం ఎక్సైజ్ శాఖకు నాలుగు దరఖాస్తులు వచ్చాయి. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీకన్వెన్షన్, కేఎస్‌ఆర్ కంటిన్యూమ్‌లో ఈవెంట్ల నిర్వహణకు ఎక్సైజ్ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలోనే మరోచోట ఈవెంట్ నిర్వహించేందుకు అందిన దరఖాస్తుకూ అనుమతి రానుంది. ఈ ఈవెంట్లలో సినీనటులతో ప్రత్యేక నృత్యరూపకాలు ప్రదర్శించనున్నారు. రుచికరమైన ఆహారం, మద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖాళీ స్థలంలో నిర్వహణకు నిరాకరణ
గుంటూరు పశ్చిమ పరిధిలోనే ఓ ఖాళీ స్థలంలో నైట్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు. ప్రకటనలు ఇచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌నూ ఓపెన్ చేశారు. అయితే దీనికి పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. అయినా అధికారపార్టీ నేతల అండదండలతో ఈవెంట్‌ను అనుమతి లేకున్నా నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు, ఎకై ్సజ్ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
న్యూఇయర్ నైట్ ఈవెంట్లలో మద్యానికి అనుమతి
Comments
Please login to add a commentAdd a comment