జీజీహెచ్‌లో వెల్‌నెస్ సెంటర్ ప్రారంభం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో వెల్‌నెస్ క్లీనిక్‌ను తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న ఆధునిక జీవనశైలి, అహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా అనేక మంది ప్రజలు బీపీ, షుగర్ వ్యాధి బారిన పడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ముందస్తుగా వ్యాధులపై అవగాహన కల్పించి వ్యాధుల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెల్‌నెస్ క్లీనిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మాట్లాడుతూ ప్రతి సోమ, బుధవారం మూడో నంబరు ఓపీ గదిలో వెల్‌నెస్ క్లీనిక్‌లు పనిచేస్తాయన్నారు. జీవన శైలి వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారని, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. సీనియర్ ఐవీఎస్ స్పెషలిస్టు, హెచ్‌డీఎస్ సభ్యుడు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఆధునిక వైద్యాన్ని సామాన్యులకు చేరువచేయాలనే లక్ష్యంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు వెల్‌నెస్ క్లీనిక్‌లను ప్రతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సమత, ఎస్‌పీఎం డిపార్ట్‌మెంట్ విభాగాధిపతి డాక్టర్ సీతారామ, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శైలజ, సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ డాక్టర్ బత్తుల వెంకటసతీష్‌కుమార్, అసిస్టెంట్ ఆర్‌ఎంలో డాక్టర్ జోతుల మురళి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment