కనుల పండువగా సుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణం
కర్లపాలెం: శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కర్లపాలెం మండలం పెదపులుగువారిపాలెంలో సుబ్రమణ్యేశ్వరస్వామి శాంతి కల్యాణోత్సవంలో భాగంగా రెండు రోజుల నుంచి హోమాలు, విశేషపూజలు నిర్వహిస్తున్నారు. నాగమ్మతల్లి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను, చిత్రపటాలను ఉంచి శాస్త్రోక్తంగా శాంతి కల్యాణం నిర్వహించారు. అఖండ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు విన్నకోట సురేష్, కల్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని విన్నకోట సురేష్ భక్తులతో కలసి ప్రారంభించారు. సురేష్ మాట్లాడుతూ సర్వమానవాళి సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులందరూ స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించటం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment