తైక్వాండో పోటీల్లో 24 మందికి పతకాలు
తెనాలి అర్బన్: తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో తెనాలికి చెందిన కేఎస్‌ఆర్ తైక్వాండో అకాడమీకి చెందిన 23 మందికి పతకాలు లభించాయి. ఈ మేరకు కోచ్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. వీరిలో 10 మందికి బంగారు, తొమ్మిది మందికి వెండి, ఐదుగురికి కాంస్య పతకాలు లభించినట్లు చెప్పారు. పోటీలను బాపట్ల జిల్లా రేపల్లెలోని శ్రీవాసవీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 11, 12వ తేదీలలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు పతకాలను ఆదివారం అకాడమీలో అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో వీరవల్లి మురళి, సర్పంచ్ కె.నాగభూషణం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ–ట్రాక్టర్లతో రైతులకెంతో మేలు
పెదకాకాని: తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ కాలం సేవలందించే ఎలక్ట్రికల్ ట్రాక్టర్లతో రైతులకెంతో మేలు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రికల్ ట్రాక్టర్‌ను మురుగన్ గ్రూప్ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. గుంటూరు నగరంలోని ఆటోనగర్‌లో ఆదివారం ఎలక్ట్రికల్ ట్రాక్టర్‌ను మంత్రి స్వయంగా నడిపి షషోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తూ ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ పనుల నిర్వహణకు ఈ–ట్రాక్టర్లను రైతులు ఉపయోగించుకోవచ్చన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎలక్ట్రికల్ ట్రాక్టర్లను తీసుకువచ్చే దిశగా ఆలోచన చేస్తామన్నారు. రైతులకు సబ్సిడీపై ఈ–ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో చార్జింగ్ స్టేషన్‌లు అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో మురుగన్ గ్రూప్ సీఈఓ కె.హరిచంద్ర ప్రసాద్, గుంటూరు(తూర్పు) ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment