కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎస్పీ సతీష్‌కుమార్ సోమవారం మైదానానికి చేరుకుని ఏఎస్పీలతో మాట్లాడారు. 680 మంది పరీక్షలకు రాగా 102 మంది ధ్రువపత్రాలు లేకపోవడంతో వెనుదిరిగారు. మిగతా 578 మంది అభ్యర్థులకు శరీర కొలతలు నిర్వహించగా 58 అనర్హత పొందారు. 520 మందికి 1600 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించగా 377 మంది తదుపరి పరీక్షలకు అర్హత సాధించారు. 377 మందికి 100 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించగా 189 మంది అర్హత సాధించారు. 377 మందికి లాంగ్ జంప్ పోటీలు జరగ్గా 362 మంది అర్హత సాధించారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), జిల్లా ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment