గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Published Tue, Jan 21 2025 2:18 AM | Last Updated on Tue, Jan 21 2025 2:19 AM

గుంటూ

గుంటూరు

మంగళవారం శ్రీ 21 శ్రీ జనవరి శ్రీ 2025

కొరిటెపాడు(గుంటూరు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు పూర్తయింది. అయితే ఇంత వరకు కొత్త పింఛన్ల పంపిణీపై కార్యాచరణ రూపొందించలేదు. గతేడాది అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇంతవరకు ఒక్క పింఛన్‌ కూడా ఇవ్వలేదు సరికదా కనీసం పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ కూడా తెరవలేదు. ఈ నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులు పింఛన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రాజకీయాలు, పార్టీలు, కుల, మతాలకు సంబంధం లేకుండా 60 ఏళ్లు నిండిన వెంటనే వలంటీర్లు దరఖాస్తు పూర్తి చేసి సచివాలయంలో ఇస్తే పింఛన్లు మంజూరయ్యేవి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పింఛన్ల మంజూరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గత ప్రభుత్వంలో పింఛను కోసం దర ఖాస్తు చేసుకున్న వారికి కూడా ఎదురు చూపులు తప్పడం లేదు. గుంటూరు నగరంలో సుమారు 2,500 మంది అర్హులైన పింఛన్‌దారులు ఉన్నారు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ తెరుచుకోకపోవడంతో వారంతా ఆశగా ఎప్పుడు వెబ్‌సైట్‌ తెరుస్తారా అని నిరీక్షిస్తున్నారు.

అర్హత ఉన్నా ఎదురు చూపులే..

అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు రోజూ పదుల సంఖ్యలో లబ్ధిదారులు వస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ల దరఖాస్తు కోసం వెబ్‌సైట్‌ తెరవకపోవడంతో అర్హులు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో? ఇంకా ప్రభుత్వం నుంచి సమాచారం లేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో పక్కాగా..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పింఛను దరఖాస్తు చేసుకున్న వెంటనే అందించేవారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగింది. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం పింఛన్ల వెబ్‌సైట్‌ను పూర్తిగా నిలిపివేసింది. దీంతో కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.

రెండు వందల రోజులు దాటినా

తెరుచుకోని వెబ్‌సైట్‌..

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఆగిన పింఛన్‌ వెబ్‌సైట్‌.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 200 రోజులు దాటినా ఎందుకు తెరుచుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారు.

పింఛన్లు తొలగించే కుట్ర..

కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు.. ప్రస్తుతం ఉన్న పింఛన్లను ఎలాగైనా తొలగించాలని అధికార పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. పింఛన్‌ లబ్ధిదారులను సర్వే చేసి అనర్హత పేరుతో తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే ఉన్న పింఛన్లు తొలగించడానికి అధికార పార్టీ నాయకులు కుట్రలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

న్యూస్‌రీల్‌

ఐదు నెలలుగా పింఛన్‌ కోసం తిరుగుతున్నా..

నా వయస్సు 58 ఏళ్లు. నా భర్త ఇమ్మానియేలు మరణించి 8 నెలలు కావస్తోంది. ఒక కూతురు ఉంది. పెళ్లి కావడంతో అత్తారింటికి వెళ్లి పోయింది. గతంలో నా భర్త ఇమ్మానియేలుకు వృద్ధాప్య పింఛన్‌ వచ్చేది. ఆ పింఛన్‌తో ఇద్దరం జీవనం సాగించేవాళ్ళం. ఇటీవల సర్వే నిర్వహించి నా భర్తకు వచ్చే పింఛన్‌ తొలగించారు. దీంతో నాకు ఏ ఆధారం లేకుండా పోయింది. వితంతు పింఛన్‌ కోసం ఐదు నెలలుగా కాళ్లు అరిగేలా సచివాలయం చుట్టూ తిరుగుతున్నాను. పింఛన్‌ కోసం దరఖాస్తు చేయాలని సచివాలయం అధికారులను వేడుకుంటున్నా. వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదని సమాధానం ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందించి నాకు పింఛన్‌ వచ్చేలా చూడాలని వేడుకంటున్నా.

– ఢీకాల మరియమ్మ, భారత్‌పేట

No comments yet. Be the first to comment!
Add a comment
గుంటూరు1
1/4

గుంటూరు

గుంటూరు2
2/4

గుంటూరు

గుంటూరు3
3/4

గుంటూరు

గుంటూరు4
4/4

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement