తమ్ముడిపై కత్తితో దాడిచేసిన అన్న అరెస్ట్
తాడేపల్లిరూరల్: ప్రకాష్‌నగర్‌లో తమ్ముడిపై కత్తితో అన్న దాడిచేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సాక్షిలో వచ్చిన వార్తా కథనానికి తాడేపల్లి పోలీసులు స్పందించి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు మాట్లాడుతూ ప్రకాష్‌నగర్‌కు చెందిన ఆరిఫ్‌ను అతని అన్నయ్య అయిన షేక్ మీరా అలియాస్ ఆసిఫ్ పాత గొడవల నేపథ్యంలో డిసెంబర్ 12న కూరగాయలు కోసే కత్తితో పొడిచాడని వివరించారు. ఆరిఫ్‌ను బంధువులు 108 వాహనం ద్వారా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని, జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు వివరించారు.
సాక్షి వార్తా కథనంతో
స్పందించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment