ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
నరసరావుపేట రూరల్: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన కనుపోలు ఉదయ్‌కిరణ్ (32) రెండు సంవత్సరాలుగా పట్టణంలోని 60 అడుగుల రోడ్డు సమీపంలో నివసిస్తున్నాడు. కార్లు క్రయవిక్రయ వ్యాపారం చేస్తున్నాడు. నష్టాలు రావడంతో మార్కెట్ సెంటర్‌లో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య జయలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ కిశోర్ తెలిపాడు. అయితే ఉదయ్‌కిరణ్ ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల పాలైనట్లు ప్రచారం జరిగింది. ఇలా దాదాపు రూ.10 లక్షలు పొగొట్టుకున్నట్టు చెబుతున్నారు. కానీ ఈ ప్రచారాన్ని అతడి భార్య ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment