గౌడ కులస్తులకు మద్యం షాపులు కేటాయింపు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గౌడ కులస్తులకు మద్యం షాపులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో 13, పల్నాడు జిల్లాలో 13 షాపుల చొప్పున 26 షాపులను కేటాయించింది. వీరికి మద్యం దుకాణాలు కేటాయింపునకు సంబంధించి ఎక్కడెక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలో పూర్తి వివరాలతో గెజిట్ త్వరలో విడుదల కానుంది. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఎకై ్సజ్ అధికారులు షాపులు కేటాయిస్తారు.
బీజేపీ జిల్లా అధ్యక్షునిగా చెరుకూరి తిరుపతిరావు
గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన చెరుకూరి తిరుపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఇన్‌చార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ఎన్నికల పరిశీలకులు కుమారస్వామి మంగళవారం ప్రకటించారు. గుంటూరు లాల్‌పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు.
బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా శశికుమార్
నరసరావుపేట: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిడుగురాళ్లకు చెందిన యేలూరి శశికుమార్ ఎన్నికయ్యారు. మంగళవారం సాయంత్రం సత్తెనపల్లిరోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో జిల్లా పరిశీలకుడు జూపూడి రంగరాజు సమక్షంలో ఎన్నికల కన్వీనర్ పులి కృష్ణారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. శశికుమార్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడు. రెండేళ్లుగా పల్నాడు జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment