అక్రమంగా సాగుచేస్తున్న పంటలు ధ్వంసం
శాఖమూరు(తాడికొండ): సీఆర్డీఏ పరిధిలోని శాఖమూరు గ్రామంలో పూలింగ్‌కు ఇచ్చిన భూముల్లో అక్రమంగా రైతులు సాగుచేస్తున్న పంటలను అధికారులు ఎట్టకేలకు ధ్వంసం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేసి పత్రికల్లో కథనాలు రాయించి టీడీపీ నాయకులు కక్షతో పంటలను ధ్వంసం చేయించారు. ఈ ప్రాంతంలో పనుల్లేక పశువులను మేపుకుంటూ పశువుల మేతకోసం జొన్నసాగు చేసుకుంటున్న తమను ఇబ్బందులకు గురిచేయడంపై గ్రామస్తులు మాకుమ్మడిగా అధికారులను ప్రశ్నించారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు అక్రమంగా సాగుచేస్తున్న 40 ఎకరాల్లోని పంటలను మంగళవారం దున్నివేయించారు. మిగిలిన గ్రామాల్లో కూడా రైతులు పశుగ్రాసం కోసం పంటలు సాగు చేసుకుంటుండగా రాజధాని అభివృద్ధి పనులు పేరుతో అధికారులు వాటిని తీసేయాలని హుకుం జారీ చేస్తుండటంపై పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల విషయంలో పక్షపాతం వహించకుండా అందరికీ ఒకే న్యాయం జరిగేలా అధికారులు వ్యవహరించాలని కోరుతున్నారు.
40 ఎకరాలను జేసీబీల సాయంతో
దున్నేయించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment