మాట్లాడుతున్న అడిషనల్ కమిషనర్
వరంగల్ అర్బన్: రుణాలు, వివిధ పథకాల్లో బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని బల్దియా అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం స్వానిధి పథకంలో భాగంగా ప్రభుత్వం గతంలో బల్దియాకు సూచించిన లక్ష్యాన్ని చేరుకొని దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా ఇటీవల అదనంగా మరో 6వేల మంది స్ట్రీట్ వెండర్లను గుర్తించి రుణాలు అందించాలని ఆదేశించిందని, బ్యాంకర్లు సహకారం అందించాల ని కోరారు. ఈ నెల చివరిలోగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని, ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీల అందజేత పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు (పీఎంఎఫ్‌ఎంఈ)కి దరఖాస్తు చేసుకున్న వారి యూనిట్లు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సూచించారు. సమావేశంలో టౌన్ ఐకేపీ ఇన్‌చార్జ్ రాజేష్, ఎల్‌డీఎం హవేలీ రాజు, డీపీఎంలు అనిత, సరిత, డీఎంసీ రేణుక, టీఎంసీ రమేష్, ఏపీఎంలు పాల్గొన్నారు.
అడిషనల్ కమిషనర్ అనిసుర్ రషీద్
Comments
Please login to add a commentAdd a comment