ఓటర్లకు అందుబాటులో ‘చాట్‌బాట్‌’ యాప్‌ | Sakshi
Sakshi News home page

ఓటర్లకు అందుబాటులో ‘చాట్‌బాట్‌’ యాప్‌

Published Mon, May 6 2024 3:35 AM

-

హన్మకొండ అర్బన్‌ : పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్లకు చాట్‌బాట్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని హనుమకొండ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్‌ ద్వారా వయోవృద్ధులు, దివ్యాంగులు తమ ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లయితే సంబంధిత పోలింగ్‌ కేంద్రంతో పాటు అక్కడి సదుపాయాలు తెలుసుకోవచ్చన్నారు. చాట్‌బాట్‌ యాప్‌ ద్వారా వీల్‌చైర్‌ అవసరమైన వయో వృద్ధులు, దివ్యాంగులు అడిగే అవకాశంతో పాటు, దివ్యాంగులకు సైన్‌ లాంగ్వేజ్‌లో ట్రైనర్స్‌తో వివరిస్తారన్నారు. ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌ ద్వారా ఉపయోగించుకుని వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. చాట్‌ బాట్‌ యాప్‌ను ఓటర్లు సద్వినియోగించుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు.

Advertisement
Advertisement