ఫిరాయింపులపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలి
హన్మకొండ: పార్టీ ఫిరాయింపులు, పార్టీ నిర్ణయాల కు వ్యతిరేకంగా నడుచుకునే ఎంపీలు, ఎమ్మెల్యేల పై చర్యలు తీసుకునేందుకు కనీస కాలవ్యవధి నా లుగు వారాలుగా నిర్ణయిస్తూ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో సవరణ చేయాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1985లో 52వ రాజ్యాంగ స వరణ ద్వారా ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఇందులో పార్టీ వ్యతిరేక చర్యలు, ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు నిర్ణీత కాలవ్యవధి లేకపోవడంతో స్పీకర్లు జాప్యం చేయడానికి అవకాశముందన్నారు. ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన 6వ షెడ్యూల్‌లో చర్యలకు నిర్ణీత కాలవ్యవధి చేర్చాలనే అంశాన్ని ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా నిర్ణీత కాలవ్యవధి నిర్ణయిస్తూ సవరణకు చొరవ తీసుకోవాలన్నారు. లేకపోతే ప్రజాప్రతినిధులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని, ఆ లోపు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే తామే సుమోటగా విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ స్పీకర్ కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు విని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోర్టుతో చీవాట్లు తినొద్దన్నారు.
మాజీ ఎంపీ వినోద్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment