ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
హసన్‌పర్తి : వరంగల్‌లో ‘వాడ్రా’ అమలుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చించినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ధారిస్తామని, చెరువులు, కుంటల వివరాలు అందించాలని ఇప్పటికే సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. హసన్‌పర్తి, హనుమకొండ, వరంగల్, కాజీపేట, ఐనవోలు, ఖిలావరంగల్ మండలాల్లో పలు చెరువులు కబ్జాకు గురైనట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు.కబ్జాదారులు తన కుటుంబ సభ్యులైన వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment