వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ డీఎంహెచ్‌ఓ వెంకటరమణ
కాశిబుగ్గ: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వరంగల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.వెంకటరమణ అన్నారు. కాశిబుగ్గ యూపీహెచ్‌సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించాలని కోరారు. అనంతరం కాశిబుగ్గ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగీ వ్యాధిగ్రస్తుడి ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యాధిగ్రస్తుడి ఇంటి ప్రాంతం పరిధిలో చేపడుతున్న యాంటీ లార్వెల్ ఆపరేషన్, పైరిత్రం స్ప్రేను పరిశీలించారు. శిబిరంలో ఇన్‌చార్జ్ ఏఎంఓ మాడిశెట్టి శ్రీనివాస్, హెల్త్ సూపర్‌వైజర్ సదానందం, సీఓ మోహన్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment