ఫోన్ ద్వారా బుకింగ్..
నిర్వాహకురాలితోపాటు విటుడి అరెస్ట్
హసన్‌పర్తి: నగరంలోని గోపాలపురం శివసాయి కాలనీలో ఓ వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్, పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలితోపాటు విటుడిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. వేలేరు మండలం షోడషపల్లికి చెందిన తిమ్మాపురం లలిత ఏడాది క్రితం గోపాలపురంలో ఓ ఇల్లును అద్దెకు తీసుకుంది. సులువుగా డబ్బులు సంపాదించడాని కి వ్యభిచార గృహం నడపాలని నిర్ణయించుకుంది. ఇతర రాష్ట్రాలనుంచి యువతులను రప్పించి వారితో వ్యభిచారం చేయించడం ప్రారంభించింది. ఏడాదిగా ఈ దందా సాగుతోంది. విటుల కు ఫోన్ ద్వారా బుకింగ్ సౌకర్యం కూడా కల్పించింది. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, కేయూసీ పోలీసులు ఆ గృహంపై దాడులు నిర్వహించారు. నిర్వాహకురాలు లలితతోపాటు మహబూబాబాద్‌జిల్లాకు చెందిన ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఇతర రాష్ట్రంనుంచి దిగుమతి చేసుకున్న యువతిని కాపాడినట్లు చెప్పారు. దాడుల్లో కేయూసీ ఇన్‌స్పెక్టర్ సంజీవ, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment