No Headline
హన్మకొండ చౌరస్తా: నాలుగో డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ శివారులో 2007లో జ్యోతిబసునగర్ ఫేజ్–02 కాలనీ ఏర్పడింది. కుల, మతాలకు అతీతంగా సుమారు 250 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు. అంతా నిరుపేదలే. ఇప్పటికీ కాలనీవాసులకు మున్సిపల్ నల్లా కనెక్షన్లు లేవు. కాలనీలో సైడ్ డ్రెయినేజీలు పేరుకుపోవడంతో మురుగు నిలిచి దుర్వాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. వీధిలైట్లు వెలగడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు అంతర్గత రోడ్లు ఆధ్వానంగా మారడంతో నడవలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలుపుతున్నారు.
వీధిలైట్లు వెలగడం లేదు
నెల రోజులనుంచి వీధిలైట్లు వెలగడం లేదు. రాత్రి వేళల్లో పనిపై బయటికి వెళ్లాలంటే భయంగా ఉంటుంది. వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచి చీకట్లో కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారు.
– వెల్దండి శ్రీదేవి, స్థానికురాలు
Comments
Please login to add a commentAdd a comment