వినాయకనగర్.. నడవలేని దుస్థితి
మడికొండ: గ్రేటర్ పరిధిలోని 64వ డివిజన్ మడికొండ వినాయకనగర్ కాలనీలో చినుకు పడితే చిత్తడవుతున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రెయినేజీ లేకపోవడంతో రోడ్లపై నిలుస్తున్న మురుగు నీటితో స్థానికులు అవస్థలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు కనీసం దోమల నివారణకు ఫాగింగ్ కూడా చేయలేదని వాపోతున్నారు. అప్పటి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ రోడ్లు, సైడ్ డ్రెయినేజీ నిర్మిస్తానని హమీ ఇచ్చినా కార్యరూపం దాల్చ లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే నాగరాజు అయినా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
సైడ్ కాల్వలు, రోడ్లు నిర్మించాలి
మా కాలనీలో 20ఏళ్ల క్రితం వేసిన రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నడవ డానికి సైతం ఇబ్బందిగా ఉంది. వర్షం పడితే బయటకు వెళ్లలేని పరిస్థితి. దోమలతో నిద్ర ఉండడం లేదు. అధికారులు స్పందించి సైడ్ కాల్వలు, రోడ్లను నిర్మించాలి.
– కొత్తకొండ శ్రీనివాసు, స్థానికుడు
Comments
Please login to add a commentAdd a comment