జెడ్పీ మార్పులో జాప్యం
సమీపిస్తున్న స్థానిక ఎన్నికలు
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈలోపే జెడ్పీల మార్పుపై నిర్ణయం తీసుకోవాల్సిందే. మండల ప్రజాపరిషత్ ఎన్నికలు జిల్లా ప్రజా పరిషత్ నుంచే నిర్వహించనున్న క్రమంలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో ప్రాదేశిక నియోజక వర్గాల ఏర్పాటు, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ బూత్‌ల గుర్తింపు, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల మెటీరియల్, ఎన్నికల సిబ్బందిని సమకూర్చుకోవడం వంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ క్రమంలో రెండు జిల్లా ప్రజాపరిషత్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటేనే ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి వీలవుతుంది. ఈ దిశగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు చొరవ చూపాల్సిన అవసరముందని రెండు జిల్లాల ప్రజలు కోరుతున్నారు.
హన్మకొండ: జెడ్పీ పాలక మండళ్ల పదవీ కాలం పూర్తికాగానే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా ప్రజాపరిషత్‌ల స్థానంలో హనుమకొండ, వరంగల్ జిల్లా ప్రజాపరిషత్‌లు ఏర్పాటవుతాయని ప్రజలు భావించారు. ఈ ఏడాది జూలై 4తో పాలక మండళ్ల పదవీ కాలం ముగిసింది. రెండు నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి కనబరుస్తున్న వారు ఈ రెండు జిల్లా ప్రజాపరిషత్‌ల పునర్విభజనపై దృష్టి సారించారు.
2021లో అర్బన్, రూరల్ జిల్లాల
పేరు మార్పు
రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. ఈ క్రమంలో పూర్వ వరంగల్ జిల్లాలోని మండలాలను ఆరు జిల్లాల్లో కలిపింది. అందులో భాగంగా ఏర్పాటుచేసిన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా ఉండడం బాగా లేదని, రెండు ప్రధాన నగరాలు హనుమకొండ, వరంగల్ ఉండగా అర్బన్, రూరల్ పేర్లతో పిలువమేమిటని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం 2021, ఆగస్టు 12న వరంగల్ అర్బన్‌ను హనుమకొండ, వరంగల్ రూరల్‌ను వరంగల్ జిల్లాలుగా ఏర్పాటు చేసింది. అప్పటికే జిల్లా ప్రజాపరిషత్‌లకు పాలక మండళ్లు కొనసాగుతుండడంతో అర్బన్, రూరల్ జిల్లా ప్రజాపరిషత్‌లుగానే కొనసాగుతూ వచ్చాయి. 2021లో హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా ఏర్పాటయ్యే వరకు వరంగల్ అర్బన్ జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి. ఇందులో ఆ జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో ప్రస్తుతం ఏడు మండలాలు మాత్రమే ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 18 మండలాలుండగా జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో 16 మండలాలున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఉన్న పరకాల డివిజన్‌లోని 5 మండలా లు, వరంగల్ అర్బన్ జిల్లాలోని 9 మండలాలు కలి పి మొత్తం 14 మండలాలతో కలిపి హనుమకొండ జిల్లాగా ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలోని మిగతా 13 మండలాలతో కలిసి వరంగల్ జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజాపరిషత్‌లు ఏర్పాటు కావాల్సిన అవసరముంది.
హనుమకొండ, వరంగల్ జిల్లా ప్రజాపరిషత్‌లుగా విభజన ఎప్పుడు?
జూలై 4తో ముగిసిన అర్బన్, రూరల్ పాలక మండళ్ల పదవీకాలం
నేటికీ జరగని పునర్విభజన..
నిర్ణయం తీసుకోని ప్రభుత్వం
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..
ఆశావహుల ఎదురుచూపు
Comments
Please login to add a commentAdd a comment