బుధవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2024
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధిలోని రైల్వే కాలనీలు సమస్యల్లో కూరుకుపోయాయి. కడిపికొండ ఆర్వోబీకి ఇరువైపులా ఇన్, అవుట్ రోడ్లు పక్కన చెట్లు పెరిగి అధ్వానంగా కనిపిస్తున్నాయి. చెట్లనుంచి దోమలు, విషపురుగులు క్వార్టర్స్‌లోకి వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. కడిపికొండ బ్రిడ్జి కింద రైల్వే కార్మిక కుటుంబాల పిల్లల కోసం ఏర్పాటుచేసిన చిల్డ్రన్స్‌పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రైల్వే ఎలక్ట్రిక్‌లోకోషెడ్ నుంచి కాజీపేట రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. కాజీపేట మెయిన్ రోడ్ నుంచి రైల్వే దేవాలయ సముదాయానికి వెళ్లే మార్గంలో గుంతలు పడ్డాయి. గుంతల్లో వర్షం నీరు నిలుస్తుండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
అధికారులు పట్టించుకోవాలి
రైల్వే కాలనీల నిర్వహణను అధికారులు పట్టించుకోవాలి. రైల్వే క్వార్టర్ల చుట్టూ పెరిగిన చెట్లను తొలగించాలి. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేయించాలి. చిల్డ్రన్స్ పార్క్‌ను మెయింటనెన్స్ చేయాలి లేదా పూర్తిగా మూసి చేయాలి.
–ఎండీ యూనుస్, బాపూజీనగర్
●
రైల్వే క్వార్టర్లలో విషపురుగులు
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment