కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవు
నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యామ్
హన్మకొండ కల్చరల్ : కళలకు భాషా, ప్రాంతీయ భేదాలు ఉండవని, కళాకారులను ప్రోత్సహించాలని కూచిపూడికి చెందిన రాష్ట్రపతి అవార్డు గ్రహి త, ప్రఖ్యాత నాట్యాచార్యులు డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ తెలిపారు. మయూరి నాట్యకళాక్షేత్రం 17వ వార్షికోత్సవాన్ని సోమవారం రాత్రి హనుమకొండలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. రిటైర్డ్ డీఈఓ బూర విద్యాసాగర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాధేశ్యామ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నాట్య కళాక్షేత్రం నిర్వాహకురాలు కుండె అరుణను అభినందించారు. అనంతరం విద్యార్థినులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో వరంగల్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డాక్టర్ తరుణ్‌రెడ్డి, సీతాల రఘువేందర్, పొట్లపల్లి ప్రసాద్‌రావు, మేకల రమేష్, ఆలేటి శ్యామ్‌సుందర్, పెండెం వేణుమాధవరావు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment